రాష్ట్రంలో స్వర్ణభారత్ ట్రస్ట్
ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: గ్రామీణ భారత సాధికారతే లక్ష్యంగా 15 ఏళ్లుగా స్వచ్ఛంద సేవా రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ స్వర్ణభారత్ ట్రస్ట్ తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు.
కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ముఖ్య అతిథిగా, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విశిష్ట అతిథిగా, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచి విద్య, వైద్య సేవలు కల్పించడంతో పాటు ప్రతిభ, నైపుణ్య, స్వయం ఉపాధి, సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించాలనే లక్ష్యంతో దశాబ్దంన్నర కిందట నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యకలాపాలను ప్రారంభించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్ఫూర్తిగా ఆయన కుమార్తె దీపావెంకట్ నెలకొల్పిన ఈ ట్రస్ట్.. విజయవాడ చాప్టర్‌ను గతేడాది కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.