
ఉంగుటూరు (గన్నవరం): భారత స్వరాజ్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన ఆత్మత్యాగాలను తెలుసుకోవడంతోపాటు, స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్‌లో శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతమహోత్సవ్ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 75 మంది జీవితగాథలతో రూపొందించిన శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరిచడం ఆనందంగా ఉందన్నారు.
సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ఇలాంటి పుస్తకం ఆవిష్కరిచండం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్షీప్రసాద్, సత్యసాయిబాబా సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణ్‌రావు, సినీగేయ రచయిత భువనచంద్ర శ్రీవాణి మాసపత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకుడు శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment