Venakaiah Naidu
-
‘సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టాలి’
సింగపూరు పాఠశాలలో తెలుగుని మాతృభాషా మాధ్యమంగా ప్రవేశపెట్టేలా శ్రీ సాంస్కృతిక కళా సారధి ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం తరుపు నుంచి సింగపూరు ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యాలని కోరుతూ శ్రీ సాంస్కృతిక కళా సారధి వారి విజయోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి అభ్యర్ధన పత్రం అందించారు. సింగపూరు నందు దాదాపు 2 శాతం తెలుగు ప్రజలు నివశిస్తున్నారు. తెలుగుని మాతృ భాషలలో ఒకటిగా గుర్తించడం కొన్ని వేల తెలుగు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో శ్రీ సాంస్కృతిక కళా సారధి, కాకతీయ సాంస్కృతిక పరివారము, తెలుగుదేశం ఫోరం ఆఫ్ సింగపూరు సంస్థల ప్రతినిధులు కవుటూరి రత్న కుమార్, జొన్నాదుల సుధాకర్, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, దామచర్ల అశోక్ కుమార్‌లు తెలియజేశారు. తెలుగును భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికి అవసరమైన సాయం తనవైపు నుంచి అందిస్తానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి
ఉంగుటూరు (గన్నవరం): భారత స్వరాజ్యం కోసం ఎందరో మహానుభావులు చేసిన ఆత్మత్యాగాలను తెలుసుకోవడంతోపాటు, స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో శ్రీవాణి మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతమహోత్సవ్ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 75 మంది జీవితగాథలతో రూపొందించిన శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరిచడం ఆనందంగా ఉందన్నారు. సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ శ్రీవాణి సాంస్కృతిక మాసపత్రిక ఇలాంటి పుస్తకం ఆవిష్కరిచండం శుభపరిణామమన్నారు. రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్షీప్రసాద్, సత్యసాయిబాబా సేవాసంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణ్‌రావు, సినీగేయ రచయిత భువనచంద్ర శ్రీవాణి మాసపత్రిక సంపాదకురాలు కొమరగిరి జయప్రద, సహ సంపాదకుడు శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు — Vice President of India (@VPSecretariat) January 23, 2022 -
కలిసి కట్టుగా టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలి: ఉప రాష్ట్రపతి
సాక్షి, ఢిల్లీ: పౌరులకు సరైన సమయంలో నాణ్యమైన సేవలు అందించడంపై మరింత దృష్టిపెట్టాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.ఆయన సోమవారం ‘యాక్సలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నరమెంట్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. 2024 నాటికి 20కోట్ల మందికి కుళాయిల ద్వారా తాగునీరందించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకోవడం అభినందనీయమన్నారు. యువతకు సరైన నైపుణ్యాన్ని అందిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ పథకం కోట్లాది మంది చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, మహిళలకు గౌరవాన్ని కల్పించిందని తెలిపారు. దేశాభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి పరిశ్రమలోనైపుణ్యాభివృద్ధికేంద్రాన్ని తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020)ను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సాధించిన ప్రగతిని వివరిస్తూ.. 28 మంది ప్రస్తుత, మాజీ ఐఏఎస్ అధికారులు, విషయ నిపుణులు రాసిన 25 వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరచడాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పుస్తక సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు శ్రీ కేజే అల్ఫోన్స్‌ను, పుస్తక ప్రచురణకర్తలను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర మంత్రులు శ్రీ వి.మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్, ఈ పుస్తకంలో వ్యాసాలు రాసిన రచయితలు పాల్గొన్నారు. -
ఆన్లైన్ చదువులు ప్రత్యామ్నాయం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా, వారిలో సృజనాత్మకత, పరిశోధనాసక్తిని పెంపొందించేదిగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదని అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఫ్‌లైన్, ఆన్లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ.. అందరికీ ఆమోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యను అందించడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలతో ఏర్పడ్డ సవాళ్లు, సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని అన్నారు. ఈ దిశలో విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. అంతే గా క వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞాన కేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదేనని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
‘వాక్ స్వాతంత్ర్యం గురించి కాంగ్రెస్సా మాట్లాడేది’
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం అంటే నేరాలకు పాల్పడే హక్కు కాదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలే తప్ప అశాంతిని పురికొల్పేలాగా మాట్లాడకూడదనిహితవు పలికారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీ గత నాలుగు రోజులుగా ఆందోళనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. దేశద్రోహులను ఇలాంటి కార్యక్రమాలకు రానివ్వొద్దంటూ ఏబీవీపీ ఆందోళన లేవనెత్తడంతో అది కాస్త రెండు గ్రూపుల పంచాయితీగా మారింది. అయితే, కొంతమంది విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నారని, పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలు ఈ గొడవలోకి బీజేపీని లాగాయి. కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. ‘భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను గౌరవించకుండా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన కాంగ్రెస్ పార్టీ నేడు వాక్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతోంది. వాక్ స్వాతంత్ర్యం రాజ్యాంగం ప్రసాధించింది. సమాజంలో అశాంతి యుత పరిస్థితులు ఏర్పడకుండా, ఎవరి మనోభావాలు కించపరచకుండా ఆ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. భారత దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఎవరు కూడా ప్రత్యేకవాదాన్ని ప్రోత్సహించరు’ అని వెంకయ్యనాయుడు అన్నారు. -
పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు