
సాక్షి, న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కరోనా బారినపడ్డారు. ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.
ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు — Vice President of India (@VPSecretariat) January 23, 2022