మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత | Inverter gifted to special abilities center | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత

Published Wed, Nov 9 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత

మానసిక వికలాంగుల కేంద్రానికి చేయూత

  •  స్వర్ణభారత్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐ.దీపావెంకట్‌   
  • వెంకటాచలం : మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చేయూతనిస్తుందని ఆ ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐ.దీపావెంకట్‌ అన్నారు. దీపావెంకట్‌ కుమారుడు విష్ణు జన్మదినం సందర్భంగా వెంకటాచలంలోని సెయింట్‌ జ్యూడ్స్‌ మానసిక వికలాంగుల కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. రూ.25వేల విలువ చేసే ఇన్వర్టర్‌ను, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు కేంద్రానికి బహూకరించారు. మానసిక వికలాంగులకు అరటి పండ్లు, తినుబండరాలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ పక్కనే ఉన్న మానసిక వికలాంగుల కేంద్రంలో నా కుమారుడు విష్ణు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మానసిక వికలాంగుల కేంద్రానికి స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ తరపున చేయూత నిస్తామని తెలియజేశారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్‌ జనార్దన్‌రాజు, బీజేపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల మురళి పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement