4న లోక్‌సభ స్పీకర్ జిల్లా పర్యటన
నెల్లూరు(పొగతోట) : లోక్‌సభ స్పీకర్ సుమిత్రమహాజన్ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. 4న ఉదయం 6.20 గంటలకు ఇన్‌డోర్‌లో ప్రత్యేక విమానంలో బయలుదేరి 7.50 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. రేణిగుంట నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 8.30 గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు అక్షర విద్యాలయం, స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో రేణిగుంటకు బయలుదేరి వెళ్లతారు.
మంత్రి ధర్మేంద్రప్రధాన్ జిల్లా పర్యటన
పెట్రోలియం, సహాజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఈ నెల 4వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. 4న ఉదయం చెన్నై నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9 గంటలకు వెంకటాచలం చేరుకుంటారు. అక్షర విద్యాలయం, స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు శ్రీసిటీకి బయలుదేరివెళ్లతారు.