
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయి తమ రాజీనామాలను ఆమోదించాలని మరోసారి కోరనున్నారు. ప్రత్యేక హోదా కంటే ఏదీ ముఖ్యం కాదంటూ వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.
బడ్జెట్ సెషన్స్ చివరిరోజు రాజీనామాలు చేసిన ఎంపీలు.. అనంతరం ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాజీనామాల విషయంలో పునరాలోచన చేయాలని స్పీకర్ ఇంతకు ముందు ఎంపీలను కోరారు. కానీ, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని ఎంపీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment