
సాక్షి, నెల్లూరు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆదివారం పర్యటించారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో కలిసి అమిత్ షా.. సరస్వతీ నగర్‌లోని అక్షర విద్యాలయం సందర్శించారు. అక్షరలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్ వార్సికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగారన్నారు. వెంకయ్యనాయుడు నాలుగు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ వెంకయ్యనాయుడు పాల్గొన్నారని అమితషా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment