సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్‌లో ఆదిత్య వరుణ్, టి. నిశ్చల్ చాంపియన్‌లుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఓపెన్ కేటగిరీలో ఆదిత్య, జూనియర్స్ విభాగంలో నిశ్చల్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఓపెన్ కేటగిరీలో నిర్ణీత 6 రౌండ్లు ముగిసేసరికి ఓక్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ (కొత్తపేట్)కు చెందిన ఆదిత్య వరుణ్ 6 పాయింట్లతో విజేతగా నిలిచాడు. చివరి రౌండ్‌లో దువ్వాల సురేశ్ (5)పై ఆదిత్య విజయం సాధించాడు. 5 పాయింట్లతో కె. త్రిష, సురేశ్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా త్రిష రన్నరప్‌గా నిలవగా, సురేశ్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. జూనియర్స్ కేటగిరీలో నిశ్చల్, డి. నిగమశ్రీ, పురుషోత్తం, ఎస్. బాబు 5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నిశ్చల్ అగ్రస్థానంలో... నిగమశ్రీ,, పురుషోత్తం వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అనంతరం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమంలో జాతీయ మాజీ ప్లేయర్ పి. రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు.
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్–14 బాలురు: 1. బి. పురుషోత్తం, 2. శ్రీగణేశ్ చరణ్; బాలికలు: 1. హాసిత, 2. ఎన్. అక్షయ;
అండర్–12 బాలురు: 1. సీహెచ్ మోక్షజ్ఞ, 2. ఎం. శ్రీ జీవన్; బాలికలు: 1. నిగమశ్రీ, 2. వేద శ్రుతి.
అండర్–10 బాలురు: 1. ఎస్. బాబు, 2. ఎ. హిమాన్షు; బాలికలు: 1. కె. నిత్యశ్రీ, 2. మీనా.
అండర్–8 బాలురు: 1. డి. పార్థివ్, 2. వి. సంతోష్ కుమార్.
అండర్–6 బాలురు: 1. కె. ద„Š , 2. పి. సాయి జయంత్.
Comments
Please login to add a commentAdd a comment