
సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఏడో ‘డ్రా’ నమోదు చేసింది. జార్జియా గ్రాండ్‌మాస్టర్ బేలా ఖోటెనాష్‌విలితో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హారిక 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హారిక 4.5 పాయింట్లతో ఇరీనా క్రుష్ (అమెరికా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది. తొమ్మిదో రౌండ్‌లో ఇరీనా క్రుష్‌తో హారిక ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment