రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నీ బ్రోచర్‌ విడుదల | Chess Broucher Released | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నీ బ్రోచర్‌ విడుదల

Published Tue, Jul 2 2019 2:00 PM | Last Updated on Tue, Jul 2 2019 2:00 PM

Chess Broucher Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పడాల లక్ష్మమ్మ, భూమా గౌడ్‌ స్మారక తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్, కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఈనెల 13, 14 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. విజేతకు రూ. 30,000 ప్రైజ్‌మనీ అందజేయనున్నారు.  వివరాలకు  www. chesstelangana.com వెబ్‌సైట్‌లో లేదా ప్రశాంత్‌ గౌడ్‌ (88010 00222, 88010 00666)ను సంప్రదించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement