సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల వయసులోనే ఓ చిచ్చర పిడుగు అద్బుతం చేసింది. కేవలం 9.23 నిమిషాల్లో 104 చెక్‌మేట్-ఇన్-వన్-మూవ్ పజిల్స్‌ను పరిష్కరించి వహ్వా అనిపించింది. చెస్ ప్రాడిజీ ఇషాని చక్కిలం ఈ ఘనత సాధించింది.
ఇషాని నమోదు చేసిన ఈ ఫీట్‌ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా గుర్తించాల్సి ఉంది. కాగా ఇషాని.. రాయ్ చెస్ అకాడమీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థిని. అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పంతో చిన్న వయసులోనే ఈ అద్బుతం చేసింది. ఆమెలో దాగున్న ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు శ్రీకాంత్- శ్రావ్య చక్కిలం విజయవంతంగా ముందుకు సాగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు.
రాయదుర్గంలో జరిగిన ఈ ఈవెంట్‌కు మంత్రి కొండా సురేఖతో పాటు బ్రిటిష్ డిప్యూటీ హై-కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ కూడా హాజరయ్యారు. ఇషాని ప్రతిభకు ముగ్ధులై ఆమెను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చెస్ క్రీడాకారులు, కోచ్‌లు, ఇషాని బంధువులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment