సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) స్కూల్ పిల్లల చెస్ టోర్నీలో సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు సత్తా చాటింది. కొంపల్లిలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొత్తం 130 మంది చిన్నారులు పాల్గొన్న ఈ టోర్నీని తరగతుల వారీగా నిర్వహించారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ కంచన్ దులాని, యూనిసెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సీవీ రమాదేవి ముఖ్యఅతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
విజేతల వివరాలు
మొదటి తరగతి బాలురు: 1. గురుదేవ్, 2. రిషిత్; బాలికలు: 1. మంజరి;
రెండో తరగతి బాలురు: 1. సాయి అనీశ్, 2. వైభవ్; బాలికలు: 1. రుషిత, 2. సాత్విక.
మూడో తరగతి బాలురు: 1. చరణ్, 2. ధ్రువ్ కుమార్; బాలికలు: 1. సిద్ధిక, 2. టియా బేడీ;
నాలుగో తరగతి బాలురు: 1. అనీశ్, 2. రిత్విక్; బాలికలు: 1. చైత్ర;
ఐదో తరగతి బాలురు: 1. ప్రణీత్, 2. త్రిశాంక్; బాలికలు: 1. హర్షిత, 2. సొనాల్ సింగ్;
ఆరో తరగతి బాలురు: 1. ప్రణయ్, 2. సూర్యప్రతాప్; బాలికలు: 1. సేవిత విజు, 2. ప్రణీత. ఏడో తరగతి బాలురు: 1. హేమంత్, 2. నీల్ జాన్ వివేక్; బాలికలు: 1. కీర్తి, 2. వేద.
ఎనిమిదో తరగతి బాలురు : 1. ప్రభంజన్, 2. మిహిర్; బాలికలు: 1. యజ్ఞ ప్రియ, 2. శ్రీచరిత. తొమ్మిదో తరగతి బాలురు: 1. ఎన్. రోహిత్, 2. శ్రీ గణేశ్.
Comments
Please login to add a commentAdd a comment