చాంప్స్‌ సూర్య, సాయి అఖిల | Surya, Sai Akhila win Chess Title | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ సూర్య, సాయి అఖిల

Published Thu, Oct 4 2018 10:06 AM | Last Updated on Thu, Oct 4 2018 10:06 AM

Surya, Sai Akhila win Chess Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఆలకంటి సూర్య, ఎం. సాయి అఖిల చాంపియన్‌లుగా నిలిచారు. బుధవారం జరిగిన ఈ టోర్నమెంట్‌ అండర్‌–15 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. బాలుర కేటగిరీలో సూర్య, జి. అజితేశ్, సిద్ధార్థ్‌ రామానంద్‌ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. బాలికల కేటగిరీలో అఖిల టైటిల్‌ను కైవసం చేసుకుంది. అండర్‌–13 బాలుర కేటగిరీలో ఓజస్, సహస్రాన్ష్‌, ముకుంద్‌ తుషార్‌... బాలికల విభాగంలో సాయి మనస్విని, సహస్ర, అమీనా బేగం తొలి మూడుస్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన చిన్నారులను తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్‌ అభినందించారు.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్‌–11 బాలురు: 1. కె. నితిక్, 2. కోవిధ్‌ కుషాల్‌ రెడ్డి, 3. సూర్య సాహస్‌ రెడ్డి; బాలికలు: 1. ఇషాన్వి, 2. జయహరిచందన, 3. అస్మా మర్యమ్‌ బేగం.
అండర్‌–9 బాలురు: 1. విశ్వజిత్‌ సాయి, 2. పార్థ గుప్తా, 3. సాయి రిత్విక్‌; బాలికలు: 1. సహజ్‌దీప్‌ కౌర్, 2. శరణ్య, 3. సురభి.
అండర్‌–7 బాలురు: 1. పర్హివ్, 2. ఆర్యన్, 3. పవన్‌ కార్తికేయ; బాలికలు: 1. సంహిత, 2. అనన్య, 3. శ్రీష. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement