
సాక్షి, హైదరాబాద్: జాతీయ మహిళల అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి చొల్లేటి సహజశ్రీ అదరగొట్టింది. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
కరీంనగర్‌కు చెందిన సహజశ్రీ నిర్ణీత 11 రౌండ్‌ల తర్వాత 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో చైనా వేదికగా డిసెంబర్ 31 నుంచి 6 వరకు జరుగనున్న ప్రపంచ అమెచ్యూర్ చెస్ చాంపియన్‌షిప్‌కు ఆమె అర్హత సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment