సాక్షి, హైదరాబాద్: చెన్నై ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ తొలి గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్‌కు నిరాశ ఎదురైంది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో అర్జున్ టాప్–10 చోటు దక్కించుకోలేకపోయాడు. నిర్ణీత 10 రౌండ్లు ముగిసేసరికి 6 పాయింట్లతో 51వ స్థానంతో టోర్నీని ముగించాడు. తొలి రౌండ్‌లో బద్రి నారాయణ్ (భారత్), రెండో గేమ్‌లో మొహమ్మద్ అబ్‌జిద్ రహమాన్ (బంగ్లాదేశ్)లపై గెలుపొందిన అర్జున్... గ్రాండ్ మాస్టర్ జియాదినోవ్ రసెత్ (అమెరికా)తో జరిగిన మూడో గేమ్‌లో ఓటమి చవిచూశాడు. అనంతరం ట్రిటోన్ మాక్సిమ్ (ఫ్రాన్స్), సెంథిల్ మారన్, ముత్తయ్య (భారత్)లతో జరిగిన మూడు గేముల్లో విజయాలు సాధించాడు. గ్రాండ్ మాస్టర్ డేవియాకిన్ అండ్రెయ్ (రష్యా)తో జరిగిన ఏడో గేమ్‌ను డ్రాగా ముగించిన అర్జున్ తర్వాతి రెండు గేముల్లో పరాజయాలు చవిచూశాడు. రాకేశ్ (భారత్)తో జరిగిన చివరిదైన పదోగేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment