
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఇ. హిమేశ్, జి. ఆదిత్య వరుణ్ విజేతలుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్ విభాగంలో కేంద్రీయ విద్యాలయకు చెందిన హిమేశ్ నిర్ణీత ఆరు రౌండ్లలో 6 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నికుంజ్, సి. హేమ సాయి వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. ఓపెన్ కేటగిరీలో 5.5 పాయింట్లు సాధించిన ఆదిత్య విజేతగా నిలవగా, సృజన్ కీర్తన్, కె. తరుణ్ తర్వాతి స్థానాలను దక్కించుకున్నారు.
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్–14 బాలురు: 1. చైతన్య కుమార్, 2. భరత్ కుమార్; బాలికలు: 1. ఎ. శ్రీద, 2. ఎస్. స్థాపిక. n అండర్–12 బాలురు: 1. నికుంజ్, 2. సి. హేమసాయి; బాలికలు: 1. భిల్వ నిలయ, 2. మౌనిక. n అండర్–10 బాలురు: 1. పి. తనుశ్, 2. సీహెచ్. అనిరుధ్; బాలికలు: 1. జి. ఈశ్వాని, 2. ఎం. వేద శ్రుతి. n అండర్–8 బాలురు: 1. విఘ్నేశ్ అద్వైత్, 2. నందసాయి వినీశ్; బాలికలు: 1. ఆర్. సమీర, 2. తనుశ్రీ. n అండర్–6 బాలురు: 1. పవన్ కార్తికేయ, 2. డి. పార్థివ్.
Comments
Please login to add a commentAdd a comment