టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ వరుసగా రెండో విజయం సాధించాడు. నెదర్లాండ్స్‌లో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన అర్జున్ 42 ఎత్తుల్లో డానియల్ డార్దా (బెల్జియం)పై గెలిచాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్ తర్వాత అర్జున్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment