టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ తొలి రోజు ఆడిన మూడు గేమ్‌లనూ ‘డ్రా’ చేసుకున్నాడు. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్–నిహాల్ సరీన్ (భారత్) తొలి గేమ్ 44 ఎత్తుల్లో... అర్జున్–విదిత్ (భారత్) రెండో గేమ్ 35 ఎత్తుల్లో... అర్జున్–నారాయణన్ (భారత్) మూడో గేమ్ 67 ఎత్తుల్లో ‘డ్రా ’గా ముగిశాయి. మహిళల విభాగంలో భారత స్టార్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య కూడా తమ తొలి మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment