
న్యూఢిల్లీ: అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. అర్మేనియా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) పెట్రోసియాన్ టిగ్రాన్‌తో శనివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను అర్జున్ 14 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
తెలంగాణకే చెందిన హర్ష భరతకోటి, రాజా రిత్విక్‌లు కూడా తమ ఐదో రౌండ్ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. జయకుమార్ (భారత్)తో జరిగిన గేమ్‌ను రిత్విక్ 39 ఎత్తుల్లో... పద్మిని రౌత్ (భారత్)తో జరిగిన గేమ్‌ను హర్ష 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment