సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక ఆలిండియా బిలో 1500 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ మొహమ్మద్ ఇమ్రాన్ విజేతగా నిలిచాడు. ఉప్పల్‌లో జరిగిన ఈ టోర్నీ తొమ్మిదో రౌండ్‌లో రోహిత్ (7 పాయింట్లు, మధ్యప్రదేశ్)పై ఇమ్రాన్ విజయం సాధించి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇమ్రాన్‌కు ట్రోఫీతో పాటు రూ. 50 వేల నగదు బహుమతి లభించింది. సిద్దిఖ్ అక్బర్ (తమిళనాడు) 8 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 30 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు. తృతీయ స్థానంలో నిలిచిన షేక్ అబ్దుల్ నబీ (8 పాయింట్లు, ఆంధ్రప్రదేశ్)కు రూ. 20 వేలు లభించాయి. సాయికాంత్ (7.5, ఆంధ్రప్రదేశ్), ఆనంద్‌బాబు (7, తమిళనాడు), తిరుపతి చారి (7, తెలంగాణ), రోహిత్ (7, మధ్యప్రదేశ్), శ్రీనాథ్ (7, తమిళనాడు), విష్ణు రామ్ (7 తమిళనాడు), శ్యామ్‌సుందర్ (7, ఆంధ్రప్రదేశ్) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో రాష్ట్ర చెస్ సంఘం కార్యదర్శి కేఎస్ ప్రసాద్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment