Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదని వార్నింగ్ ఇస్తున్నారు. ముందు పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని, ఆత్మవిశ్వాసం ఉంటే పర్లేదని.. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని హితవు పలుకుతున్నారు.
కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు పాక్‌కు వెళ్లదని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు బోర్డుల మధ్య ఈ అంశానికి సంబంధించి చర్చోపర్చలు జరిగాయి.
సాకు మాత్రమే అంటూ
ఈ నేపథ్యంలో ఆసియా కప్ పాక్‌లో నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇమ్రాన్ నాజిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘భద్రతా కారణాలు అనేవి కేవలం ఓ సాకు మాత్రమే. ఆస్ట్రేలియా వంటి మేటి జట్లు కూడా పాకిస్తాన్‌కు వచ్చాయి.
కానీ భారత జట్టు మాత్రం రావడానికి సాకులు వెదుకుతోంది. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే వాళ్లు ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడేగా అన్నీ తెలుస్తాయి. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఆసక్తి. కానీ టీమిండియాకు ఓటమిని తట్టుకునే శక్తి ఉండదు.
అందుకే ఇలా చేస్తున్నారు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్ షోలో ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఇమ్రాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ‘‘అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. గతంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ అప్పటికప్పుడు సిరీస్‌లు రద్దు చేసుకున్న విషయం గుర్తులేదా?
టీమిండియా వంటి పటిష్ట జట్టు గురించి ఇలాంటి అవాకులు చెవాకులు పేలేముందు ఓసారి ఆలోచించుకుంటే మంచిది. మీ స్థాయి ఏమిటో మర్చిపోవద్దు. మీకంత సీన్ లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 పాక్‌లో జరుగనుండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని!
Suryakumar Yadav: ఈ మూడు మ్యాచ్‌లను మర్చిపో సూర్య.. ఐపీఎల్‌లో బాగా ఆడు!
Comments
Please login to add a commentAdd a comment