ఆమంత్రణ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో ఫిడే మాస్టర్లు కంది రాము, మట్టా వినయ్ కుమార్ చాంపియన్‌లుగా నిలిచారు.
ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఆమంత్రణ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో ఫిడే మాస్టర్లు కంది రాము, మట్టా వినయ్ కుమార్ చాంపియన్‌లుగా నిలిచారు. ముషీరాబాద్‌లోని ఆమంత్రణ్ హోటల్‌లో జరిగిన ఈ టోర్నీ ర్యాపిడ్ ఈవెంట్‌లో ఐదు రౌండ్లు ముగిసేసరికి 5 పాయింట్లతో రాము విజేతగా నిలిచాడు. అమిత్‌పాల్ సింగ్, డీఎస్ రావు వరుసగా రెండు మూడు స్థానాలను దక్కించుకున్నారు. బ్లిట్జ్ విభాగంలో 5గేమ్‌ల తర్వాత 4.5 పాయిం ట్లతో వినయ్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నాగ శశాంక్, రామకృష్ణమూర్తి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా చెస్ సంఘం (హెచ్‌డీసీఏ) అధ్యక్షులు కేఎస్ ప్రసాద్, ఆమంత్రణ్ హోటల్ యజమాని వినోద్ గాంధీ పాల్గొన్నారు.
ఇతర వయోవిభాగాల బాలబాలికల విజేతల వివరాలు
అండర్–15: 1. కృష్ణ దేవర్ష్, 1. టి. జయశ్రీ; అండర్–13: 1. కార్యశ్రీ, 2. నటురా బేతి; అండర్–11: 1. ధనుశ్, 1. అద్వైత శర్మ; అండర్–9: 1. పార్థ్ గుప్తా, 2. నిగమశ్రీ; అండర్–7: 1. ఆదిత్య, 2. సస్య.