నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో అండర్–17 రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి వెంకటరణమణయ్య తెలిపారు. గురువారం ఆయన అక్షర విద్యాలయంలో చెస్ చాంపియన్ షిప్ పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల,బాలికల విభాగంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన వారిని కోల్‌కత్తాలోని అమిత్ విశ్వవిద్యాలయంలో సెప్టంబరు 9 నుంచి జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్, అక్షర విద్యాలయ డైరెక్టర్ హరగోపాల్, తదితరులు ఉన్నారు.