
చాంపియన్ హిమసూర్య
సాక్షి, హైదరాబాద్: ఆర్‌వీ అవనీంద్ర సబ్ జూనియర్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో కె. హిమసూర్య సత్తా చాటాడు. సింప్లీ చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ర్యాపిడ్ విభాగంలో ఐదు రౌండ్లు ముగిసేసరికి ఐదు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో ప్రణవ్ సాయి (5 పాయింట్లు) రన్నరప్‌గా నిలవగా, ఎంఎం సాయి రిత్విక్ (4 పాయింట్లు) మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–15 బాలబాలికల విభాగంలో కృష్ణ దేవర్ష్ , జి. దీక్షిత విజేతలుగా నిలిచారు. అండర్–13 బాలుర కేటగి రీలో ప్రభవ్ సాయి, తులసీ రామ్, శేఖర్ మనీశ్... బాలికల విభాగంలో ఎస్. శ్రుతిక, యజ్ఞ ప్రియ, లక్ష్మీ హర్షిత వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. ఈ టోర్నీ లో శ్రవణ్, సూర్య కృష్ణ ఆకట్టుకున్నారు.
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్–11 బాలురు: 1. ప్రణవ్ సాయి, 2. రిషి వర్ధన్, 3. పవన్ సాయి. బాలికలు: 1. మోక్షజ్ఞ, 2. శ్రీకరి, 3. ప్రణీత ప్రియ. అండర్–9 బాలురు: 1. కె. నితిక్, 2. అర్నవ్ ప్రదాన్, 3. హిమానిశ్. బాలికలు: 1. ఆర్. లక్ష్మీ సమీరజ, 2. బి. అమూల్య, 3. ఎన్‌ఎస్‌ఎల్‌ఎస్ వర్షిత. అండర్–7 బాలురు: 1. కె. సంతోష్, 2. పార్థు, 3. ఆదిత్య. బాలికలు: 1. సహజ్‌దీప్ కౌర్, 2. కె. శ్రీష, 3. ఎం. జష్మిత.