సాక్షి, హైదరాబాద్: అఖిల భారత ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు నిరాశే ఎదురైంది. చివరి వరకు టైటిల్ బరిలో నిలిచిన భరత్‌కుమార్ రెడ్డి, వి. వరుణ్, సుమేర్ అర్ష్ అనుకున్నది సాధించలేకపోయారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కౌస్తవ్ కుందు ఈ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. ప్రకాశ్ రామ్ (పంజాబ్) రన్నరప్‌గా నిలవగా, భరత్‌కుమార్ రెడ్డి మూడోస్థానంతో సంతృప్తి పడ్డాడు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోరీ్నలో నిర్ణీత 9 రౌండ్ల అనంతరం కౌస్తవ్ 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
7.5 పాయింట్లు సాధించిన ప్రకాశ్ రామ్, భరత్ కుమార్ రెడ్డి, వి. వరుణ్, షేక్ సుమేర్ అర్ష్ ముసిని అజయ్ (ఏపీ) రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా ప్రకాశ్, భరత్‌కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో... సుమేర్, అజయ్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారు. విజేతగా నిలిచిన కౌస్తవ్ ట్రోఫీతో పాటు రూ. 50,000 ప్రైజ్‌మనీ అందుకోగా... ప్రకాశ్ రామ్‌కు రూ. 25,000, భరత్ రూ. 13,000 బహుమతిగా అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment