
హంపి, హారిక ఓటమి
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఆరో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు పరాజయాలు ఎదురయ్యాయి. ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌లో జుయ్ జావో (చైనా) 24 ఎత్తుల్లో హంపిపై... తాతియానా కొసింత్‌సెవా (రష్యా) 32 ఎత్తుల్లో హారికపై గెలిచారు. ఈ టోర్నీలో హంపికిది మూడో ఓటమికాగా, హారికకు తొలి పరాజయం. సోమవారం జరిగే ఏడో రౌండ్‌లో కొసింత్‌సెవాతో హంపి; అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో హారిక తలపడతారు.