
న్యూఢిల్లీ: అత్యుత్తమ వంట విధానాలున్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇటలీ, గ్రీస్, స్పెయిన్ తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. వంటలో వాడే పదార్థాలు, దినుసులు, పానీయాలపై ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ర్యాంకులు దక్కాయి. 2022కు గాను టేస్ట్ అట్లాస్ చేపట్టిన ఈ ఓటింగ్‌లో భారత్‌కు 4.54 పాయింట్లు వచ్చాయి. జపనీస్ వంటకాలు నాలుగో స్థానంలో ఉన్నాయి.
టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2022 ఫలితాల ప్రకారం..400కు పైగా భారత వంటదినుసుల్లో గరం మసాలా, ఘీ, మలాయ్, బట్టర్ గార్లిక్ నాన్, కీమా తదితరాలకు అగ్రస్థానం దక్కింది. దేశంలో మంచి ఆదరణ ఉన్న 450 హోటళ్లలో ముంబైలోని ప్రముఖ శ్రీ థాకర్ భోజనాలయ్, బెంగళూరులోని కారవల్లి, ఢిల్లీలోని బుఖారా, దమ్ ఫఖ్త్, గురుగ్రామ్‌లోని కొమోరిన్ రెస్టారెంట్లకు అత్యధిక ఓట్లు పడ్డాయి. అయితే, ప్రపంచదేశాల్లో ఆదరణ ఉన్న చైనా వంటకాలకు 11వ స్థానం, పేరున్న థాయ్ వంటకాలకు 30వ స్థానం దక్కడంపై నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. కాగా, ఈ జాబితాలో అమెరికా 8వ, ఫ్రాన్సు 9వ ర్యాంకుల్లో నిలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment