వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా ఐదో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత జట్టు విజయ భేరి మోగించింది. 274 పరుగుల లక్ష్యాన్ని 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. భారత విజయంలో ఛేజ్‌మాస్టర్ విరాట్ కోహ్లి మరోసారి కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో 104 బంతులు ఎదుర్కొన్న విరాట్ 95 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో తన 49వ వన్డే సెంచరీ చేసే అవకాశాన్ని కోహ్లి కోల్పోయాడు. విరాట్‌తో పాటు ఆఖరిలో రవీంద్ర జడేజా(44 బంతుల్లో 39 నాటాట్) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు.
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ(46) పరుగులతో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి భారత్ చేరుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు సాధించగా.. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, శాంట్నర్ తలా వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలలో డార్లీ మిచెల్ (130) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర(75) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ రెండు, సిరాజ్, బుమ్రా తలా వికెట్ సాధించారు. ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 29న బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment