టెస్టు క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్ ఫార్మాట్‌లో 100 సిక్స్‌లు బాదిన తొలి జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బాదిన సిక్సర్‌తో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని అందుకుంది. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డును టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 17 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ సేన.. 105 సిక్స్‌లు నమోదు చేసింది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇంగ్లండ్ (2022) 89 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా, 87 సిక్స్‌లతో టీమిండియానే మూడో స్ధానంలో ఉంది.
2021 ఏడాదిలో భారత్ టెస్టుల్లో 87 సిక్స్‌లు బాదింది. ప్రస్తుత మ్యాచ్‌లో భారత్ ఇప్పటివరకు 8 సిక్స్‌లు కొట్టింది. పంత్, సర్ఫరాజ్ తలా 3 సిక్స్‌లు బాదగా.. రోహిత్, విరాట్ చెరో సిక్స్ కొట్టారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 13 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), పంత్(53) పరుగులతో ఉన్నారు.
చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment