India vs England, 2nd Test- No Place For Sarfaraz Khan: టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఖాయమని అభిమానులతో పాటు భారత మాజీ క్రికెటర్లు కూడా భావించారు.
కానీ మేనేజ్‌మెంట్ మాత్రం అతడికి మరోసారి మొండిచేయి చూపింది. తుదిజట్టులో చోటు కోసం మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌ల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో పాటిదార్ వైపే మొగ్గుచూపింది.
ఇప్పటికే టీమిండియా తరఫున వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన పాటిదార్‌కే టెస్టు క్యాప్ కూడా అందించింది. దీంతో సర్ఫరాజ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
‘‘పాపం.. సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. ఇన్నాళ్లు జట్టుకు ఎంపికే చేయలేదు. ఈసారి ఛాన్స్ ఇచ్చారనుకుంటే తుదిజట్టులో ఆడించడం లేదు. అసలు అతడిని ఎందుకు పక్కనపెట్టారో కాస్త వివరించగలరా?
మీ నిర్ణయాలు మాకైతే అంతుపట్టడం లేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ఇటీవల ఇంగ్లండ్-ఏ జట్టుపై భారత్- ఏ తరఫున సెంచరీ బాది ఫామ్‌లో ఉన్నా కూడా సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుపై మీకు నమ్మకం కుదరలేదా? ఇంకెన్నాళ్లు అతడు ఎదురుచూడాలి?’’ అంటూ సెలక్టర్లపై ఫైర్ అవుతున్నారు.
No Sarfaraz..?? What..??? Please explain. Unbelievable...#INDvsENGTest #INDvsENG #INDvENG #IndianCricket #SarfarazKhan
— Raghav Srinivasan (@RaghavSrinivas7) February 2, 2024
I hope India’s more main players get injured so that Sarfaraz ko chance mile https://t.co/vXVrS2n6ND
— Akshayyyy (@AkshayyMahadik) February 2, 2024
కాగా తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు.. మొదటి టెస్టు తర్వాత రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడటంతో వారి స్థానాల్లో సౌరభ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్‌లకు రెండో టెస్టుకు ఎంపిక చేసింది బీసీసీఐ.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు మొదలైంది.
టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇక కేఎస్ భరత్‌కు సొంతమైదానంలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇలాంటి అవకాశం రావడం తనకు గర్వకారణమంటూ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు.
🗣️🗣️ It's a proud moment to be playing in front of your home crowd.
— BCCI (@BCCI) February 1, 2024
Proud and focused @KonaBharat is geared up for the 2nd #INDvENG Test in Visakhapatnam 🙌#TeamIndia | @IDFCFIRSTBank pic.twitter.com/2eUkG5vDSN
తుది జట్లు:
టీమిండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.
చదవండి: IND VS ENG 2nd Test: సర్ఫరాజ్ ఎంట్రీ గ్యారెంటీ..? ఎందుకంత స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment