టెస్టు క్రికెట్ పునరాగమనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝులిపిస్తూ ఆపద్భాందవుడిలా నిలుస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన పంత్.. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ సేనను గట్టెక్కించే క్రమంలో సర్ఫరాజ్ ఖాన్(150)తో కలిసి నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
సెంచరీకి ఒక్క పరుగు దూరంలో
అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిషభ్ పంత్ అవుటయ్యాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 89వ ఓవర్‌ను కివీస్ పేసర్ విలియం రూర్కీ వేశాడు. అయితే, అతడి బౌలింగ్‌లో మొదటి బంతికే పంత్ అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. 99 పరుగుల(9 ఫోర్లు, 5 సిక్స్‌లు) వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది.
స్టాండింగ్ ఓవియేషన్
అప్పటిదాకా సర్ఫరాజ్ ఖాన్- రిషభ్ పంత్ జోడీ న్యూజిలాండ్ బౌలర్లపై అటాకింగ్ చేస్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టిన అభిమానులు.. పంత్ శతకం మిస్ కాగానే షాక్‌కు గురయ్యారు. అయితే, గాయం తాలుకు నొప్పి వేధిస్తున్నా విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సముచిత రీతిలో గౌరవించారు. పంత్ పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.
కాగా రిషభ్ పంత్ టెస్టుల్లో ఇలా 90లలో అవుట్ కావడం ఇది ఏడోసారి. అయితే, అతడు సాధించిన శతకాలు ఆరు కావడం విశేషం. ఇక శనివారం కొత్త బంతి రాగానే కివీస్ పేసర్లు మరోసారి విజృంభిస్తున్నారు. 150 పరుగుల వద్ద సర్ఫరాజ్, 99 పరుగుల వద్ద పంత్ అవుట్ కాగానే భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది.
కేఎల్ రాహుల్(12) మరోసారి నిరాశపరచగా.. రవీంద్ర జడేజా(5) సైతం విఫలమయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్(15), జస్‌ప్రీత్ బుమ్రా(0), మహ్మద్ సిరాజ్(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
👉మొదటి టెస్టు: అక్టోబరు 16- అక్టోబరు 20
👉వేదిక: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
👉వర్షం వల్ల తొలిరోజు(బుధవారం) ఆట రద్దు కాగా.. రెండో రోజు(గురువారం) టాస్ పడింది
👉టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
👉భారత్ తొలి ఇన్నింగ్స్: 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన
👉పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయానంటూ తప్పిదాన్ని అంగీకరించిన రోహిత్
👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్
👉భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్
👉కివీస్ లక్ష్యం: 107 పరుగులు
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment