రోడ్డు ప్రమాదం.. సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌కు గాయాలు | Sarfaraz Khan's Brother Musheer Suffers In Road Accident To Miss Irani Cup: Report | Sakshi
Sakshi News home page

Road Accident: సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌కు గాయాలు

Published Sat, Sep 28 2024 11:12 AM | Last Updated on Sat, Sep 28 2024 11:42 AM

Sarfaraz Khan's Brother Musheer Suffers In Road Accident To Miss Irani Cup: Report

భారత యువ క్రికెటర్‌ ముషీర్‌ ఖాన్‌ ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. తండ్రి, కోచ్‌ నౌషద్‌ ఖాన్‌తో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో వీరికి యాక్సిడెంట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముషీర్‌ మెడకు తీవ్రంగా గాయమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ సొంత తమ్ముడు ముషీర్‌ ఖాన్‌.

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో  అదరగొట్టి
అండర్‌-19 వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముషీర్‌.. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. 360 పరుగులతో యువ భారత జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన కుడిచేతి వాటం బ్యాటర్‌.. కేవలం తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలోనే 716 పరుగులతో దుమ్ములేపాడు. 

దులిప్‌ ట్రోఫీ-2024లో శతక్కొట్టి
అంతేకాదు.. తన స్పిన్‌ బౌలింగ్‌తో ఎనిమిది వికెట్లు కూడా కూల్చాడు. ఈ ఏడాది రంజీల్లో ముంబై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల ముషీర్‌ ఖాన్‌ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ.. దులిప్‌ ట్రోఫీ-2024లో ఆడే అవకాశం ఇచ్చింది. ఇండియా-బి తరఫున బరిలోకి దిగిన ముషీర్‌ అరంగేట్రంలోనే 181 పరుగులతో అదరగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆకట్టుకున్న ఈ యువ క్రికెటర్‌ ఇరానీ కప్‌-2024 నేపథ్యంలో ముంబై జట్టుకు ఎంపికయ్యాడు.

కాన్పూర్‌ నుంచి లక్నోకు
రంజీ చాంపియన్‌ ముంబై- రెస్టాఫ్‌ ఇండియా మధ్య లక్నో వేదికగా అక్టోబరు 1-5 వరకు ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ క్రమంలో తండ్రి నౌషద్‌ ఖాన్‌తో కలిసి ముషీర్‌ కాన్పూర్‌ నుంచి లక్నో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ముంబై నుంచి బయల్దేరకుండా ముషీర్‌ ఖాన్‌ తండ్రితో కలిసి రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది

​కాగా ఈ ప్రమాదంలో ముషీర్‌ మెడకు గాయమైందని.. కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు ఇరానీ కప్‌తో పాటు.. రంజీ తాజా ఎడిషన్‌కు దూరం కానున్నట్లు సమాచారం. మరోవైపు.. సర్ఫరాజ్‌ ఖాన్‌.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టె​స్టు సిరీస్‌ ఆడుతున్న టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే, తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కలేదు. 

చదవండి: అలా జరిగితే గంభీర్‌ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement