
వైజాగ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఊవ్విళ్లరూతోంది. ఇక వైజాగ్ టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా దూరమయ్యారు.
దీంతో రెండో టెస్టు కోసం సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. అయితే జడ్డూ స్ధానంలో కుల్దీప్ యాదవ్ టెస్టు ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయం కాగా.. రాహుల్ స్ధానంలో సర్ఫరాజ్, రజిత్ పాటిదార్ ఎవరో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైజాగ్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ ఛాన్స్ ఇవ్వాలని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
"సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి రికార్డు అత్యద్భుతమైనది. భారత జట్టు తరపున డెబ్యూ చేసేందుకు సర్ఫరాజ్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అతడు 66 ఇన్నింగ్స్‌లో 69.85 సగటుతో 3912 పరుగులు చేశాడు.
అదే విధంగా 14 సెంచరీలు, 11 అర్ధశతకాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో సైతం అతడు సత్తచాటుతాడని ఆశిస్తున్నాను. మరోవైపు రజత్ పాటిదార్ కూడా డొమాస్టిక్ క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి ఎవరికి జట్టులో చోటు దక్కుతుందో వేచి చూడాలని" తన యూట్యూబ్ ఛానల్‌లో ఏబీడీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment