
న్యూజిలాండ్(India vs New Zealand) తో ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ(_ICC Champions Trophy)లోని ఆఖరి లీగ్ మ్యాచ్ భారత్‌కి ఒక కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రూపం లో సెలక్షన్ బెడద. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఆడిన తీరుపై అభినందించక తప్పదు.
బ్యాటింగ్‌లో ప్రారంభంలో కొంత తడబాటు కనిపించినా తర్వాత శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), అక్షయ్ పటేల్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆదుకోవడంతో భారత్ భారీ స్కోర్ కాకపోయినా (249/9) కొద్దిగా మెరుగైన స్కోర్ చేసింది.
తర్వాత న్యూజిలాండ్ వంతు వచ్చింది. సీనియర్ బ్యాటర్ కేన్ విల్లియమ్స్ నిలకడగా పడుతుండటం తో ఒక దశలో మెరుగ్గానే కనిపించింది. ఈ తరుణంలోనే వరుణ్ చక్రవర్తి వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ మలుపు తిప్పాడు.
చక్రం తిప్పిన వరుణ్
నిజానికి దుబాయ్ వేదిక పై వరుణ్ కి గతంలో ఎన్నడూ అదృష్టం కలిసి రాలేదు. గతం లో 2021 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా వరుణ్ ఇదే వేదిక పై మూడు మ్యాచ్ లలో ఆడాడు. ఈ మూడు మ్యాచ్ ల లో వరుణ్ గణాంకాలు 11-0-71-0 . ఈ గణాంకాలు బట్టి చూస్తే వరుణ్ ఈ వేదిక పై ఆడటం కష్టమే అనిపిస్తుంది. పాకిస్తాన్‌తో వరుణ్ ఈ వేదికపై వరుణ్ ఆడిన మ్యాచ్ పెద్ద పీడకల లాగా నిలిచిపోతుంది.
పాకిస్తాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్ లో వరుణ్ 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. గత రికార్డులను చూస్తే వరుణ్ ని దుబాయ్ వేదికపై ఆడించడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ లను అభినిందించక తప్పదు.
ఆ రోజుల్లో వరుణ్ చక్రవర్తి అసలు అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడా లేదా అని వాదించిన వారూ ఉన్నారు. ఈ నేపధ్యం లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఖచ్చితత్వంతో వైవిధ్యాలను చూపించిన వరుణ్ చివరికి 10-0-42-5 గణాంకాల తో తన ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలో అద్భుతంగా రాణించిన బౌలర్లలో ఒకడిగా రికార్డ్ నెలకొల్పాడు.
“మాకు 2021 ఐసీసీ టి20 ప్రపంచ కప్ పెద్దగా కలిసి రాలేదు (భారత్ గ్రూప్ దశల్లోనే ఓడిపోయింది). వ్యక్తిగతంగా కూడా నేను ఆ టోర్నమెంట్ లో పెద్దగా రాణించలేక పోయాను. కానీ నేను అప్పుడు నిబద్దతతోనే బౌలింగ్ చేశానని భావిస్తున్నాను. కానీ ఫలితాలు మాకు అనుకూలంగా రాలేదు.
ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా అంతా బాగానే కనిపిస్తోంది. టీమ్ ఇండియా కూడా బాగా రాణిస్తోంది. మా కాంబినేషన్లు కూడా చాలా బాగా సెట్ అయ్యాయి, కాబట్టి ఇప్పుడు అంతా బాగా కలిసి వస్తోంది’’ అని వరుణ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న తర్వాత చెప్పాడు.
కంగారు పడ్డ వరుణ్
2021ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వికెట్ పడగొట్టడంలో విఫలమైన వరుణ్ ఆ తర్వాత 2024 అక్టోబర్ వరకు భారత జట్టులో కనిపించకుండా పోయాడు. అందుకే ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, వరుణ్ తొలుత కంగారు పడ్డాడు. అతను బౌలింగ్ చేసిన మొదటి బంతిలోనే బౌండరీ ఇచ్చాడు.
“నా మొదటి స్పెల్‌లో, నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే గత విషయాలు, భావోద్వేగాలు, ఈ మైదానంలో గత మూడు సంవత్సరాలలో జరిగిన ప్రతిదీ నా మనస్సులో కదిలాడాయి. నేను దానిని అదుపులో ఉంచడానికి, నియంత్రించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. విరాట్ (కోహ్లీ) భాయ్, రోహిత్ మరియు హార్దిక్ (పాండ్యా) నాకు ప్రశాంతంగా ఉండు' అని చెప్పారు. అది నిజంగా ఏంతో సహాయపడింది" అని వరుణ్ అన్నాడు.
వరుణ్ అసాధారణ బౌలింగ్ మంగళవారం జరిగే సెమీ-ఫైనల్‌కు ముందు కెప్టేన్ రోహిత్ తన సీమర్ల పనిభారాన్ని తగ్గించడానికి బాగా సహాయపడింది. అంతే కాకుండా చివరికి ఆస్ట్రేలియాతో జరిగే పోరులో భారత్‌కు వరుణ్ రూపం లో కొత్తరకమైన తలనొప్పి తెచ్చిపెట్టింది. నలుగురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ముగ్గురు-ఇద్దరు కాంబోలోకి తిరిగి వెళ్లాలా? అలా అయితే, ఎవరిని వదిలివేయాలి? వరుణ్‌ను తొలగించడం మాత్రం ఇప్పుడు సాధ్యపడదు!
చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment