
టీమిండియా బ్యాటింగ్ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తొలిసారిగా తండ్రయ్యాడు. అతడి భార్య రొమానా జహూర్ సోమవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను సర్ఫరాజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
చేతిలో కుమారుడితో దిగిన ఫొటోను ఈ ముంబైకర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్‌కు గతేడాది జమ్మూకశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్‌తో వివాహమైంది.
చిన్నస్వామిలో దంచి కొట్టి..
కాగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. జట్టు ఓడిపోయినప్పటకి తన విరోచిత ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో సర్ఫరాజ్ చెలరేగాడు.
195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇప్పుడు పుణే వేదికగా జరగనున్న రెండో టెస్టులో అదేదూకుడు కనబరచాలని సర్ఫరాజ్ భావిస్తున్నాడు. ఒకవేళ గిల్ ఫిట్‌నెస్ సాధిస్తే సర్ఫరాజ్‌ను తుది జట్టులో కొనసాగిస్తారో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment