వెస్టిండీస్‌తో టెస్టులకు, వన్డేలకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. విండీస్ టెస్టులకు సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
మరోవైపు యువ ఆటగాళ్లు యశస్వీ జైశ్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌కు మాత్రం సెలక్టర్లు తొలి సారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. అయితే రుత్‌రాజ్ కంటే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అయితే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
కారణమిదే..
"సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే వరుస రంజీ సీజన్లలో 900కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని ఎంపికచేయకపోవడానికి సెలెక్టర్లు ఏమైనా ఫూల్స్ అనుకుంటున్నరా? సర్ఫరాజ్‌ను పరిగణనలోకి తీసుకోపోవడానికి బలమైన కారణం ఉంది. అతడి ఫిట్‌నెస్ అంతర్జాతీయ ప్రమాణాలు అనుగుణంగా లేకపోవడం ప్రధాన కారణం.
అదే విధంగా ఆఫ్ ది ఫీల్డ్‌లో కూడా అతడి ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. మేము అన్ని గమనిస్తున్నాం. కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. సర్ఫరాజ్ తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ ఈ విషయాలపై దృష్టిసారిస్తారని ఆశిస్తున్నాను. అతడు కష్టపడి బరువు తగ్గాలి. అదే విధంగా పూర్తి ఫిట్‌గా ఉండాలి. జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే బ్యాటింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.
చదవండి: IND vs WI: భారత జట్టులో నో ఛాన్స్.. సెలక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్
Sarfaraz Khan's latest Instagram Story after he wasn't selected for West Indies Tests. 👇🏻👇🏻 pic.twitter.com/ITzJMl7QUD
— Harshit Bisht (@rk_harshit29) June 25, 2023
Comments
Please login to add a commentAdd a comment