న్యూజిలాండ్‌తో టీమిండియా రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్ రోహిత్ శర్మతో వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరే క్రమంలో భారత్.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఓటమిపాలైన రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో పుణె వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుపెట్టింది.
అశూ మొదలుపెట్టాడు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా తమ ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో బౌలింగ్ అటాక్ ఆరంభించింది. అయితే, ఎనిమిదో ఓవర్ వేసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ పడగొట్టాడు.
న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్(15)ను లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత మళ్లీ 24వ ఓవర్లో అశూకు మరో వికెట్ తీసే అవకాశం వచ్చింది. వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్ క్రీజులో ఉన్న సమయంలో అశూ చేతికి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు.
రివ్యూకు వెళ్లాలా? వద్దా?
ఈ క్రమంలో అశూ వేసిన ఆఖరి బంతిని తప్పుగా అంచనా వేసిన విల్ యంగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించిన దాని కంటే ఎక్కువగా బౌన్స్ అయిన బంతి బ్యాట్‌ను తాకి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. కానీ.. పంత్ మాత్రం విల్ యంగ్ వికెట్ పట్ల కాన్ఫిడెంట్‌గా లేడు.
దీంతో భారత శిబిరంలో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహం నెలకొంది. అయితే, షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ మాత్రం విల్ యంగ్ కచ్చితంగా అవుటేనని కెప్టెన్ రోహిత్ శర్మకు చెప్పాడు. బౌలర్ అశ్విన్, ఫీల్డర్ విరాట్ కోహ్లి కూడా సర్ఫరాజ్‌కు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలో రోహిత్ రివ్యూకు వెళ్లగా.. బంతి బ్యాట్‌ను తాకి కీపర్ చేతుల్లో పడ్డట్లు తేలింది. ఫలితంగా అశూతో పాటు భారత్‌కు రెండో వికెట్ దక్కింది. విల్ యంగ్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.
అన్నా.. నన్ను నమ్మే.. నేను చూశా..
అయితే, రోహిత్ శర్మను ఒప్పించేందుకు సర్ఫరాజ్ ప్రవర్తించిన తీరు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ‘‘అన్నా.. నన్ను నమ్మే.. నేను చూశా.. అతడు అవుటే’’ అన్న చందంగా సర్ఫరాజ్ అభినయించాడు. కోహ్లి సైతం అతడికి జత కలిసి రోహిత్‌ను ఒప్పించడం విశేషం.
కాగా బెంగళూరు టెస్టులో 150 పరుగులతో అలరించిన సర్ఫరాజ్ ఖాన్ వైపు మొగ్గు చూపిన మేనేజ్‌మెంట్ కేఎల్ రాహుల్‌పై వేటు వేసింది. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌కు పుణె టెస్టు తుదిజట్టులో చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. భారత్‌తో రెండో టెస్టులో గురువారం నాటి తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి నష్టానికి 92 పరుగులు సాధించింది.
మూడో వికెట్ కూడా అతడి ఖాతాలోనే..
ఇదిలా ఉంటే.. భారత్‌తో రెండో టెస్టులో గురువారం నాటి తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 31 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి నష్టానికి 92 పరుగులు సాధించింది. లంచ్ తర్వాత కాసేపటికే అశ్విన్ మరో వికెట్ పడగొట్టాడు. డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(76) రూపంలో భారత్‌కు మూడో వికెట్ అందించాడు. 45 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు: 142/3.
అప్‌డేట్: ఇక టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు: 201/5 (62). వాషింగ్టన్ సుందర్ రచిన్ రవీంద్ర(65), టామ్ బ్లండెల్(3) వికెట్లు తీశాడు.
చదవండి: WTC: చరిత్ర సృష్టించిన అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment