
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో సైతం దుమ్ము లేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా బరోడాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్‌లో ముషీర్ ఖాన్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ముంబై 99 పరుగులకే 4 వికెట్లు పడిన క్రమంలో క్రీజులోకి వచ్చిన ముషీర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఖాన్‌కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ. కాగా ముషీర్ ఖాన్ తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలుచుకోవడం విశేషం. ఓవరాల్‌గా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 18 ఫోర్లతో 203 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ముషీర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో ముషీర్‌తో పాటు హార్దిక్ తామోర్(57) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో సత్తా చాటాడు.
చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment