Mumbai Cricket Team
-
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ వేదికగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ తన సత్తా ఎంటో మరోసారి శ్రేయస్ చూపించాడు. ఈ క్రమంలో అయ్యర్ కేవలం 201 బంతుల్లో తన తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 228 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 24 ఫోర్లు, 9 సిక్స్‌లతో 233 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్‌తో పాటు సుద్దేశ్ లాడ్(150 బ్యాటింగ్) సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 117 ఓవర్లు ముగిసే సరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 521 పరుగులు చేసింది.అయ్యర్ రీ ఎంట్రీ ఇస్తాడా?కాగా శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ కారణంగా భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయ్యర్ చివరగా ఇండియా తరపున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్యర్‌కు తన వెన్ను గాయం తిరగబెట్టడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఆ తర్వాత రంజీల్లో ఆడాలన్న బీసీసీఐ అదేశాలు దిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత దిగివచ్చిన శ్రేయస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిదద్దమయ్యాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో అతడు ఆడాడు. ఇప్పుడు రంజీ సీజన్లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అద్బుత డబుల్ సెంచరీతో అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది! -
‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’
‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్‌కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్‌కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్‌కు గురై మ్యాచ్‌కు దూరమైన ముషీర్‌కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్‌కు అంకితమిచ్చాడు.1997లో చివరిసారిగాకాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్‌గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్‌లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్‌నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.తనుశ్ కొటియాన్ వీరవిహారం.. ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్‌లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడుమిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఫలితం తేలడం కష్టమనిమోహిత్తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్‌కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషంముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఘన సన్మానంఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు ముంబై తొలి ఇన్నింగ్స్: 537 రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8. చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
అశ్విన్ వారసుడు దొరికినట్లేనా?
భారత క్రికెట్‌కు మరో అసలుసిసలైన ఆల్‌రౌండర్ దొరికేశాడు. బ్యాట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసే సత్తా అతడిది. మరోవైపు బంతితో బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెట్టే మాస్టర్ మైండ్ అతడిది. జట్టులో కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే ఆపద్బాంధవుడు. అతడే ముంబై యువ సంచలనం తనీష్ కోటియన్. కోటియన్ గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌ను ముంబై సొంతం చేసుకోవడం లోనూ తనీష్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోటియన్.. రెండో ఇన్నింగ్స్‌లో సంచలన సెంచరీతో చెలరేగాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరి కోటియన్ సెంచరీ చేయడం గమానార్హం. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ 3 వికెట్లతో సత్తాచాటాడు.అశ్విన్ వారుసుడు దొరికినట్లేనా?ఫస్ట్ క్రికెట్లో అతడి ప్రదర్శన చూసిన క్రికెట్ నిపుణులు త్వరలోనే భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఈ యువ సంచలనం.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారుసుడుగా బాధ్యతలు చేపడతాడని జోస్యం చెబుతున్నారు.కాగా అశ్విన్‌కు, తనీష్‌కు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తారు. అంతేకాకుండా బ్యాటింగ్ పొజిషేన్ కూడా దాదాపు సమానంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అశ్విన్ ఏ విధంగా అయితే ఆదుకుంటాడో, కోటియన్ కూడా విరోచిత పోరాటం కనబరుస్తున్నాడు. అశ్విన్ రిటైరయ్యాక భారత టెస్టు జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా తనీష్ మారే అవకాశముంది.ఎవరీ తనీష్.. ?25 ఏళ్ల తనీష్ కోటియన్ ముంబైలో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ముంబైకు తనీష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 రంజీ సీజన్‌తో సౌరాష్ట్రపై కోటియన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 30 రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అతడు 88 వికెట్లతో పాటు 1451 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఈ ఏడాది రంజీ సీజన్లో కోటియన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన కోటియన్.. 502 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో కూడా తనీష్ 121 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.చదవండి: -
ఇరానీ కప్ విజేతగా ముంబై.. 27 ఏళ్ల తర్వాత!
ఇరానీకప్-2024 విజేతగా ముంబై నిలిచింది. కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో.. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఛాంపియన్స్‌గా అవతరించింది. కాగా ముంబై ఇరానీకప్‌ను సొంతం చేసుకోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఇరానీ కప్ విజేతగా ముంబై నిలవడం ఇది 15వ సారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కొటియన్(64) పరుగులతో రాణించాడు. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబై జట్టుకు 121 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. అయితే శనివారం(ఆక్టోబర్ 5) ఆఖరి రోజు ఆట కావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ముంబై ఖాతాలో ఓవరాల్‌గా ఇది 62 దేశీవాళీ క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలు-45, ఇరానీ కప్-15, విజయ్ హజారే ట్రోఫీ-4, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-1 ముంబై పేరిట ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
పృథ్వీ షా విధ్వంసకర ఫిప్టీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై
ఇరానీ కప్-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న 76 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముంబై 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ముంబై ప్రస్తుతం 274 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(9), తనీష్ కొటియన్(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్(191) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అదే విధంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది.. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అయితే ఇంకా కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం కన్పిస్తోంది.చదవండి: ధోని కోసమే ఆ రూల్స్‌ను మార్చారు: మహ్మద్ కైఫ్ -
డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్
బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తుదిజట్టులో చోటివ్వని సెలక్టర్లకు సవాల్ విసిరేలా ధనాధన్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరానీ కప్-2024లో భాగంగా ఈ ముంబై క్రికెటర్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్బంతిని కసితీరా బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఆకాశమే మద్దుగా చెలరేగి 253 బంతుల్లో.. 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్ యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్ లిస్టులో యశస్వి జైస్వాల్(21 ఏళ్ల 63 రోజుల వయసులో), ప్రవీణ్ ఆమ్రే(22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ(25 రోజుల 255 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈసారి ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాకాగా ద్విశతకం బాదిన అనంతరం.. హెల్మెట్ తీసి డ్రెసింగ్ రూం వైపు బ్యాట్ చూపుతూ సర్ఫరాజ్ తన సంతోషాన్ని పంచుకోగా.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్‌తో అతడిని అభినందించారు. ఇక ప్రతి ఏడాది రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ ట్రోఫీ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ముంబై రంజీ చాంపియన్‌గా నిలిచి.. రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతోంది.భారీ స్కోరు సాధించిలక్నోలోని ఏకనా స్టేడియంలో మంగళవారం(అక్టోబరు 1) ఈ ఐదు రోజుల మ్యాచ్ మొదలైంది. ఇందులో.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై రెండో రోజు ఆటలో భాగంగా 500 పైచిలుకు పరుగులు సాధించింది. బుధవారం నాటి ఆట సందర్భంగానే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! 💯 turns into 2⃣0⃣0⃣ 👌A sensational double century for Sarfaraz Khan✌️He becomes the 1⃣st Mumbai player to score a double ton in #IraniCup 👏The celebrations say it all 🎉#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/225bDX7hhn— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2024 -
శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి
బుచ్చిబాబు టోర్నీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటైన శ్రేయస్.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మరోసారి షార్ట్‌బాల్ బలహీనతను అయ్యర్ అధిగమించలేకపోయాడు. తమిళనాడు పేసర్ అచ్యుత్ వేసిన షార్ట్‌పిచ్ బాల్‌కు ఫుల్‌షాట్ ఆడబోయి క్యాచ్‌గా శ్రేయస్ దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అతడి చేతి వేలికి ప్రాక్టీస్ సమయంలో గాయమైంది. అయితే గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై పై 286 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘన విజయం సాధించింది. 510 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 223 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో షామ్స్ ములానీ(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌గా ముంబై.. 42వ సారి
రంజీ ట్రోఫీ 2023-24 విజేతగా ముంబై నిలిచింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు ముంబై చిత్తు చేసింది. తద్వారా 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై తమ ఖాతాలో వేసుకుంది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బ్యాటర్లలో కెప్టెన్ ఆక్షయ్ వాద్కర్(102), కరుణ్ నాయర్(74) పరుగులతో పోరాడనప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ముంబై బౌలర్లలో తనీష్ కొటియన్ 4 వికెట్లతో చెలరేగగా.. తుషార్ దేశ్ పాండే,ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ధావల్ కులకర్ణి, సామ్స్ ములానీ చెరో వికెట్ సాధించారు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన ముషీర్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అదేవిధంగా సీజన్ అసాంతం బౌలింగ్ ప్రదర్శనతో అకట్టుకున్న తనీష్ కొటియన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం విధర్బ సైతం తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై బౌలర్ల దాటికి విదర్బ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కులకర్ణి, ములానీ, కొటియన్ తలా మూడు వికెట్లతో విధర్బను దెబ్బతీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విధర్బ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక విధర్బ చతికిలపడింది. -
కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్ అయ్యర్! స్టంప్స్ ఎగిరిపోయాయిగా
ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యాటర్, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ సెకెండ్ సెమీఫైనల్లో క్రికెట్ అకాడమీ వేదికగా ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అయ్యర్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై 22 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు స్పిన్నర్ సాయికిషోర్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. అంతకుముందు తమిళనాడు సైతం తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైంది. కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. బీసీసీఐ సీరియస్.. అయ్యర్ రీ ఎంట్రీ వాస్తవానికి అయ్యర్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముంబై జట్టుకు అందుబాటులో ఉండాల్సింది. కానీ వెన్ను నొప్పి సాకు చెప్పి క్వార్టర్స్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ శ్రేయస్‌ను ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు దిగిచ్చొన అయ్యర్ సెమీఫైనల్స్‌కు అందుబాటులోకి వచ్చాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ తమ్ముడు..
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు, ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో సైతం దుమ్ము లేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా బరోడాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ముషీర్ ఖాన్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ముంబై 99 పరుగులకే 4 వికెట్లు పడిన క్రమంలో క్రీజులోకి వచ్చిన ముషీర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ముషీర్ ఖాన్‌కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ. కాగా ముషీర్ ఖాన్ తన తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలుచుకోవడం విశేషం. ఓవరాల్‌గా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 18 ఫోర్లతో 203 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముషీర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో ముషీర్‌తో పాటు హార్దిక్ తామోర్(57) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 7 వికెట్లతో సత్తా చాటాడు. చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్ శర్మ! వీడియో వైరల్ -
సెంచరీతో చెలరేగిన కెప్టెన్.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గ్రూప్ ‘బి’ నుంచి ముంబై, ఆంధ్ర జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాక ముంబై 30 పాయింట్లతో తొలి స్థానంలో, ఆంధ్ర 25 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. కేరళ 14 పాయింట్లతో మూడో స్థానంలో, ఛత్తీస్‌గఢ్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈనెల 16 నుంచి జరిగే చివరిదైన ఏడో రౌండ్ మ్యాచ్‌ల్లో కేరళతో ఆంధ్ర; అస్సాంతో ముంబై తలపడతాయి. తమ చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై ఇన్నింగ్స్ తేడాతో నెగ్గినా కేరళ జట్టు 21 పాయింట్లతో మూడో స్థానం వద్దే ఆగిపోతుంది కాబట్టి ముంబై, ఆంధ్ర జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖాయమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌తో సోమవారం ముగిసిన లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 271/5తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 145 ఓవర్లలో 9 వికెట్లకు 429 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ భుయ్ (129; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 29 పరుగులు జోడించి అవుటయ్యాడు. షేక్ రషీద్ (85; 10 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. మ్యాచ్‌లో 72 పరుగులు చేయడంతోపాటు 5 వికెట్లు పడగొట్టిన ఆల్‌రౌండర్ శశికాంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టీమిండియా ఓపెనర్ అరుదైన రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో పృథ్వీ షా చెలరేగాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 185 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 159 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీని నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 351 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో భూపేన్ లల్వాణీ (102) పరుగులతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో ఆశిష్ చౌహాన్ 6 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రవి కిరణ్ మూడు, మాలిక్ ఒక్క వికెట్ సాధించాడు. -
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ స్పిన్నర్..
ముంబై స్టార్ స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అబ్దుల్లా వెల్లడించాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో అబ్దుల్లా సభ్యుడిగా ఉన్నాడు. 2009-10, 2012-13, 2015-16 సీజన్లలో రంజీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవడంలో అబ్దుల్లా కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ తరపున కూడా అబ్దుల్లా ఆడాడు. ఇక 2007 రంజీ సీజన్లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అబ్దుల్లా.. మొత్తంగా 71 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 71 మ్యాచ్‌ల్లో 2641 పరుగులతో పాటు 220 వికెట్లు తీశాడు. అదే విధంగా లిస్ట్-ఏ కెరీర్లో ఇక్బాల్‌కు మంచి రికార్డు ఉంది. లిస్ట్-ఎ క్రికెట్లో 131 వికెట్లతో పాటు 1196 పరుగులు చేశాడు. చదవండి: ODI World Cup 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్ క్రీడా స్ఫూర్తి! ఏం జరిగిందంటే? -
చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్..
మస్కట్: ముంబై జట్టు ఓమన్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (79 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హార్ధిక్ తామోర్(70 బంతుల్లో 51; 4 ఫోర్లు) రాణించడంలో ముంబై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఓమన్.. ముంబై కెప్టెన్ షమ్స్ ములానీ (3/45), శశాంక్ (2/27), అమన్ (2/26) ధాటికి 47.1ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఓమన్ బ్యాట్స్‌మెన్ ఖాలిద్ కైల్(84 బంతుల్లో 76; 4 ఫోర్లు, సిక్స్), ఖవర్ అలీ(73 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై జట్టు 43.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓమన్ బౌలర్లలో షకీల్ ఖాన్, రఫీవుల్లా తలో 2 వికెట్లు, బిలాల్ షా, ఫయాజ్ భట్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగనుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్ -
ముంబై కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం..
ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై జట్టు హెడ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. ప్రస్తుత కోచ్ రమేశ్ పొవార్ ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో అతని స్థానంలో ముజుందార్‌ను ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మకమైన ముంబై కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తదితర మాజీలు పోటీపడ్డా, చివరకు ఆ పదవి ముజుందార్‌నే వరించింది. ఈ పదవి కోసం మొత్తం 9 మంది మాజీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా.. జతిన్ పరాంజ్పే, నీలేశ్ కులకర్ణి, వినోద్ కాంబ్లీలతో కూడిన ఎంసీఏ క్రికెట్ కమిటీ ముజుందార్వైపే మొగ్గు చూపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. కాగా, ముంబై కొత్త కోచ్‌గా ఎంపికైన మజుందార్ 1994-2013 మధ్యకాలంలో 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 48.1 సగటుతో 11,167 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 60 అర్ధశతకాలు ఉన్నాయి. చదవండి: అతనో రాతి గోడ.. అతని ఓపికకు సలామ్ -
నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్..
ఇండోర్: దేశవాళీ మహిళల క్రికెట్లో ముంబై జట్టు అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయింది. తొలుత నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై మహిళా జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నాగాలాండ్ జట్టు.. ముంబై కెప్టెన్, మీడియం పేసర్ సయాలీ సత్ఘరె (8.4 ఓవర్లలో 7/5) ధాటికి 17.4 ఓవర్లలో 17 పరుగలకే చాపచుట్టేసింది. సయాలీ ధాటికి నాగాలాండ్‌కు చెందిన ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ని నమోదు చేయలేకపోయారు. సయాలీకి తోడుగా దాక్షిణి (2/12), ఎస్. థాకోర్ (1/0) రాణించారు.అనంతర స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ ఇషా ఓజా, వృషాలీ భగత్ వరుసగా మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదడంతో మరో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సయాలికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. -
షా విధ్వంసం.. తారే సూపర్ సెంచరీ.. ముంబై చాంపియన్
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ముంబై జట్టు నాలుగోసారి ఎగురేసుకుపోయింది. ముంబై కెప్టెన్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుత శతకం తోడవ్వడంతో పాటు శివం దూబే(42 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడటంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ, సమీర్ చౌదరీలు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనలో పృథ్వీ షా (39 బంతుల్లో 73 పరుగులు), ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముంబై జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), షమ్స్ ములాని (43 బంతుల్లో 36; 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూకుడుగా ఆడడంతో ముంబై 41.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యూపీ బౌలర్లు తనుశ్ కోటియన్ 2, ప్రశాంత్ సోలంకీ ఒక వికెట్ సాధించారు. -
ముంబై కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..
ముంబై: ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం కాబోయే విజయ్ హజారే టోర్నీలో ముంబై జట్టు నాయకత్వ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ చేపట్టనున్నాడు. భుజం గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి దూరమైన ఈ టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు.. విజయ్ హజారే టోర్నీలో జట్టుతో చేరి, నాయకత్వ బాధ్యతలను చేపట్టనున్నాడు. టీమిండియా మరో ఆటగాడు పృథ్వీ షా ముంబై జట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించనున్నాడు. జట్టు ఎంపిక నిమిత్తమై బుధవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. 22 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఆదిత్య తారే, సీనియర్ బౌలర్ ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితర ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాగా, ఈ టోర్నీ కోసం భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్‌ను ముంబై ప్రధాన కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. -
ముంబై కోచ్‌గా రమేశ్ పొవార్ నియామకం
సాక్షి, ముంబై: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం నియమించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన 42 ఏళ్ల పొవార్.. గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. పొవార్ నియామకం ప్రస్తుతానికి తాత్కాలికమే(ప్రస్తుత సీజన్) అయినప్పటికీ.. జట్టు అవసారాల దృష్ట్యా భవిష్యత్త్‌లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎంసీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అమిత్ పాగ్నిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కోచ్ పదవికి ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్, రమేశ్ పొవార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సెలక్టర్లు రమేశ్ పొవార్వైపే మొగ్గు చూపారు. -
ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చోటు కల్పించింది. దాంతో ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్–14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనుండటం విశేషం. ఈ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్ రాణిస్తే అతడి ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
ముంబై మెరుస్తుందా!
* 41వ టైటిల్‌పై కన్ను * నేటి నుంచి సౌరాష్ట్రతో రంజీ ఫైనల్ పుణే: రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై క్రికెట్ జట్టుకు ఘనమైన నేపథ్యం ఉంది. ఇప్పటిదాకా ఈ జట్టు రంజీ టైటిల్‌ను రికార్డు స్థాయిలో 40 సార్లు తమ ఖాతాలో వేసుకుంది. ఈనేపథ్యంలో ఈ సంఖ్యను పెంచుకునేందుకు ఆదిత్య తారే సేనకు చక్కటి అవకాశం లభించింది. నేటి (బుధవారం) నుంచి జరిగే ఫైనల్లో ముంబై జట్టు సౌరాష్ట్రను ఎదుర్కోనుంది. ఇది ముంబైకి 45వ ఫైనల్ కాగా సౌరాష్ట్రకు రెండోది. 2012-13లో ఈ రెండు జట్ల మధ్యే రంజీ ఫైనల్ జరిగింది. సచిన్ కూడా ఆడిన ఆ మ్యాచ్‌ను ముంబై మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 125 పరుగులతో నెగ్గడమే కాకుండా 40వ సారి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ముంబై జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా సాగలేదు. మూడు సీజన్ల అనంతరం ఇప్పుడు మరోసారి ఇరు జట్లు ఢీకొనబోతున్నాయి. గత రికార్డును పరిశీలిస్తే 1990-91 తర్వా త ముంబై జట్టు తాము ఆడిన 10 ఫైనల్స్‌లోనూ నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయింది. క్రితం ఫైనల్లో ఆడిన ఆదిత్య తారే, అభిషేక్ నాయర్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, విశాల్ దభోల్కర్ ఈసారి కూడా ఆడబోతున్నారు. మరోవైపు సౌరాష్ర్ట జట్టు గత ఫైనల్లో ఎదురైన ఓటమికి కసి తీర్చుకోవడంతో పాటు తమ తొలి టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ముంబై ముంబై జట్టు అన్నిరకాలుగా పటిష్టంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (1204 పరుగులు), అఖిల్ హెర్వాడ్కర్ (879), సూర్యకుమార్ యాదవ్‌లతో లైనప్ బాగుంది. కెప్టెన్ తారే సెమీస్‌లో సెంచరీ సాధించి ఊపు మీదున్నాడు. బౌలర్ శార్దూల్ ఠాకూర్ (33 వికెట్లు) ఇప్పటికే జట్టు నుంచి టాప్‌లో ఉండగా ఇక్బాల్ అబ్దుల్లా (నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు) దూసుకెళుతున్నాడు. వీరికి సీనియర్లు ధావల్ కులకర్ణి, విశాల్ దభోల్కర్, బల్విందర్ సంధూ సహకారం అందించనున్నారు. బౌలర్లను నమ్ముకున్న సౌరాష్ట్ర జయదేవ్ షా నేతృత్వంలోని సౌరాష్ట్ర అవకాశాలు బౌలర్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ జట్టు నుంచి ఇప్పటికే జయదేవ్ ఉనాద్కట్ (36 వికెట్లు), స్పిన్నర్లు కమలేష్ మక్వానా (33), ధర్మేంద్ర (27) ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి జట్టుకు విజయాలు అందించారు. బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్ రాణింపు కీలకం. ఉ. గం. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
దేశీయ క్రికెట్ కు సచిన్ ఘనంగా గుడ్ బై
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనదైన శైలిలో దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. సచిన్ రాణించి 79 పరుగులతో నాటౌట్ నిలువడంతో ముంబై జట్టు హర్యానాపై నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దేశవాళీ క్రికెట్ లో సచిన్ కు చిట్టచివరి మ్యాచ్ కావడంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి లాహ్లీ మ్యాచ్ పై నిలిచింది. నాలుగవ రోజు ఆటలో విజయానికి 39 పరుగులు కావాల్సి ఉండగా, సచిన్ 55 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించారు. సచిన్ కు తోడుగా ఉన్న ధావల్ కులకర్ణి.. మోహిత్ శర్మ బంతిని బౌండరీకి తరలించడంతో విజయం ముంబై పక్షాన నిలచింది. దాంతో సచిన్ క్రికెట్ కెరీర్ లో చివరి మ్యాచ్ కావడంతో ముంబై జట్టు మాస్టర్ కు బహుమతిగా ఇవ్వాలనే కోరిక సాకారమైంది. చివరి మ్యాచ్ లో సచిన్ 79 పరుగులతో నాటౌట్ గా నిలువడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.