ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యాటర్, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ సెకెండ్ సెమీఫైనల్లో క్రికెట్ అకాడమీ వేదికగా ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అయ్యర్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై 22 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు స్పిన్నర్ సాయికిషోర్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. అంతకుముందు తమిళనాడు సైతం తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైంది. కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది.
బీసీసీఐ సీరియస్.. అయ్యర్ రీ ఎంట్రీ
వాస్తవానికి అయ్యర్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముంబై జట్టుకు అందుబాటులో ఉండాల్సింది. కానీ వెన్ను నొప్పి సాకు చెప్పి క్వార్టర్స్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ శ్రేయస్‌ను ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు దిగిచ్చొన అయ్యర్ సెమీఫైనల్స్‌కు అందుబాటులోకి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment