రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విధర్భ జట్లు తలపడుతున్నాయి. ఈ ఫైనల్ పోరులో టీమిండియా స్టార్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన అయ్యర్.. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అయ్యర్ షార్ట్ బాల్ వీక్‌నెస్‌ను విధర్బ బౌలర్ ఉమేశ్ యాదవ్ క్యాష్ చేసుకున్నాడు.
షార్ట్ పిచ్ బంతులతో అయ్యర్‌ను ఉమేశ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆఖరి ఉమేశ్ బౌలింగ్‌లోనే స్లిప్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్‌లో సైతం సతమతమవుతున్నాడు.
అదే విధంగా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను సైతం అయ్యర్ కోల్పోయాడు. దీంతో అయ్యర్ భారత జట్టులోకి ఎంట్రీ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు లంచ్ విరామానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ తామోర్(4), అజింక్యా రహానే(6) పరుగులతో ఉన్నారు. అంతకుముందు పృథ్వీ షా(46) పరుగులతో రాణించాడు.
చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
Comments
Please login to add a commentAdd a comment