సీఎస్‌కేపై ఆర్సీబీ ఘ‌న విజ‌యం.. | Chennai super kings vs royal challengers Bengaluru live Updates and Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025 Csk Vs Rcb: సీఎస్‌కేపై ఆర్సీబీ ఘ‌న విజ‌యం..

Published Fri, Mar 28 2025 7:08 PM | Last Updated on Fri, Mar 28 2025 11:26 PM

Chennai super kings vs royal challengers Bengaluru live Updates and Highlights

IPL2025 Csk Vs Rcb live Updates and Highlights: 

సీఎస్‌కేపై ఆర్సీబీ ఘ‌న విజ‌యం..
ఐపీఎల్‌-2025లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా జ‌రిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.  197 ప‌రుగుల భారీ లక్ష్యంతో బ‌రిలోకి సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 146 ప‌రుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌(41) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో ధోని(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 30)  మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 

ఆర్సీబీ బౌల‌ర్ల‌లో జోష్ హాజిల్ వుడ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. యశ్ ద‌యాల్‌, లివింగ్‌స్టోన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. చెపాక్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ విజ‌యం సాధించ‌డం 2008 సీజ‌న్ త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. 

ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు.
 

క‌ష్టాల్లో సీఎస్‌కే.. 81 ప‌రుగుల‌కే 6 వికెట్లు
సీఎస్‌కే 81 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 13వ ఓవ‌ర్ వేసిన య‌శ్ ద‌యాల్ బౌలింగ్‌లో తొలి బంతికి ర‌చిన్ ర‌వీంద్ర‌(41).. ఐదో బంతికి శివ‌మ్ దూబే(19) ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 6 వికెట్ల న‌ష్టానికి 89 ప‌రుగులు చేసింది.

సీఎస్‌కే నాలుగో వికెట్ డౌన్‌.. 
సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన సామ్ కుర్రాన్‌.. లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి శివ‌మ్ దూబే వ‌చ్చాడు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సీఎస్‌కే 4 వికెట్ల న‌ష్టానికి 65 ప‌రుగులు చేసింది.

సీఎస్‌కే మూడో వికెట్ డౌన్‌.. దీప‌క్ హుడా ఔట్‌
దీప‌క్ హుడా రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన హుడా.. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 4.4 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌: 26/3

సీఎస్‌కేకు భారీ షాక్‌.. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
197 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కేకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. రెండో ఓవ‌ర్ వేసిన జోష్ హాజిల్ వుడ్ బౌలింగ్‌లో రెండో బంతికి రాహుల్ త్రిపాఠి(5) ఔట్ కాగా.. ఆఖ‌రి బంతికి రుతురాజ్ గైక్వాడ్‌(0) పెవిలియ‌న్‌కు చేరాడు.

పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌.. సీఎస్‌కే ముందు భారీ టార్గెట్‌
చెపాక్ వేదిక‌గా చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు.

ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్‌..
జితేశ్ కుమార్ రూపంలో ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన జితేశ్‌.. ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి టిమ్ డేవిడ్ వ‌చ్చాడు.

16 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్‌
16 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ 4 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది. క్రీజులో జితేశ్ శ‌ర్మ‌(7), ర‌జిత్ పాటిదార్‌(38) ఉన్నారు.

ఆర్సీబీ మూడో వికెట్ డౌన్‌.. విరాట్ కోహ్లి ఔట్‌
విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 31 ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లి.. నూర్ ఆహ్మ‌ద్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ మూడు వికెట్ల న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది. క్రీజులో పాటిదార్‌(21), లివింగ్ స్టోన్‌(1) ఉన్నారు.

హిట్టింగ్ మొద‌లెట్టిన‌ కోహ్లి
11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ రెండు వికెట్ల న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌జిత్ పాటిదార్‌(16), విరాట్ కోహ్లి(27) ఉన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు నెమ్మదిగా ఆడిన కోహ్లి.. త‌న హిట్టింగ్‌ను మొద‌లుపెట్టాడు.

ఆర్సీబీ రెండో వికెట్ డౌన్‌.. ప‌డిక్క‌ల్ ఔట్‌
దేవ‌ద‌త్త్ ప‌డిక్కల్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 27 ప‌రుగులతో దూకుడుగా ఆడిన ప‌డిక్క‌ల్‌.. అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ 2 వికెట్ల న‌ష్టానికి 77 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(12) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. సాల్ట్ ఔట్‌.. 
ఫిల్ సాల్ట్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన సాల్ట్‌.. నూర్ ఆహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. వికెట్ల వెనక ధోని మరోసారి అద్భుతం చేశాడు. క్రీజులోకి దేవదత్త్ పడిక్కల్ వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(11), పడిక్కల్‌(9) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ ఓపెన‌ర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆర్సీబీ వికెట్ న‌ష్ట‌పోకుండా 25 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్‌(24), విరాట్ కోహ్లి(1) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో మ‌రో కీల‌క పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. సీఎస్‌కే జ‌ట్టులోకి మ‌తీషా ప‌తిరానా రాగా.. ఆర్సీబీ జ‌ట్టులోకి భువ‌నేశ్వ‌ర్ కుమార్ వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement