టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో పృథ్వీ షా చెలరేగాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 185 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 159 పరుగులు చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి రోజు లంచ్‌కు ముందే కెరీర్‌లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు.
అప్పుడు కూడా మొదటి రోజు లంచ్‌కు ముందే సెంచరీని నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 351 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో భూపేన్ లల్వాణీ (102) పరుగులతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో ఆశిష్ చౌహాన్ 6 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రవి కిరణ్ మూడు, మాలిక్ ఒక్క వికెట్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment