సాక్షి, ముంబై: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం నియమించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన 42 ఏళ్ల పొవార్.. గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. పొవార్ నియామకం ప్రస్తుతానికి తాత్కాలికమే(ప్రస్తుత సీజన్) అయినప్పటికీ.. జట్టు అవసారాల దృష్ట్యా భవిష్యత్త్‌లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎంసీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అమిత్ పాగ్నిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కోచ్ పదవికి ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్, రమేశ్ పొవార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సెలక్టర్లు రమేశ్ పొవార్‌వైపే మొగ్గు చూపారు.
Comments
Please login to add a commentAdd a comment