శ్రేయస్ అయ్యర్(ఫైల్ ఫోటో)
బుచ్చిబాబు టోర్నీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటైన శ్రేయస్.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మరోసారి షార్ట్‌బాల్ బలహీనతను అయ్యర్ అధిగమించలేకపోయాడు. తమిళనాడు పేసర్ అచ్యుత్ వేసిన షార్ట్‌పిచ్ బాల్‌కు ఫుల్‌షాట్ ఆడబోయి క్యాచ్‌గా శ్రేయస్ దొరికిపోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అతడి చేతి వేలికి ప్రాక్టీస్ సమయంలో గాయమైంది.
అయితే గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై పై 286 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘన విజయం సాధించింది. 510 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 223 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో షామ్స్ ములానీ(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment