భారత క్రికెట్‌కు మరో అసలుసిసలైన ఆల్‌రౌండర్ దొరికేశాడు. బ్యాట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసే సత్తా అతడిది. మరోవైపు బంతితో బ్యాటర్లకు ముప్పు తిప్పలు పెట్టే మాస్టర్ మైండ్ అతడిది. జట్టులో కష్టాల్లో ఉందంటే అందరికి గుర్తు వచ్చే ఆపద్బాంధవుడు. అతడే ముంబై యువ సంచలనం తనీష్ కోటియన్.
కోటియన్ గత కొంత కాలంగా దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌ను ముంబై సొంతం చేసుకోవడం లోనూ తనీష్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన కోటియన్.. రెండో ఇన్నింగ్స్‌లో సంచలన సెంచరీతో చెలరేగాడు. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరి కోటియన్ సెంచరీ చేయడం గమానార్హం. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ 3 వికెట్లతో సత్తాచాటాడు.
అశ్విన్ వారుసుడు దొరికినట్లేనా?
ఫస్ట్ క్రికెట్‌లో అతడి ప్రదర్శన చూసిన క్రికెట్ నిపుణులు త్వరలోనే భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఈ యువ సంచలనం.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారుసుడుగా బాధ్యతలు చేపడతాడని జోస్యం చెబుతున్నారు.
కాగా అశ్విన్‌కు, తనీష్‌కు దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తారు. అంతేకాకుండా బ్యాటింగ్ పొజిషేన్ కూడా దాదాపు సమానంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అశ్విన్ ఏ విధంగా అయితే ఆదుకుంటాడో, కోటియన్ కూడా విరోచిత పోరాటం కనబరుస్తున్నాడు. అశ్విన్ రిటైరయ్యాక భారత టెస్టు జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా తనీష్ మారే అవకాశముంది.
ఎవరీ తనీష్.. ?
25 ఏళ్ల తనీష్ కోటియన్ ముంబైలో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ముంబైకు తనీష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 రంజీ సీజన్‌తో సౌరాష్ట్రపై కోటియన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 30 రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన అతడు 88 వికెట్లతో పాటు 1451 పరుగులు చేశాడు.
ముఖ్యంగా ఈ ఏడాది రంజీ సీజన్‌లో కోటియన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన కోటియన్.. 502 పరుగులతో పాటు 29 వికెట్లు పడగొట్టాడు. దులీప్ ట్రోఫీ-2024లో కూడా తనీష్ 121 పరుగులతో పాటు 10 వికెట్లు సాధించాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment