రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌గా ముంబై.. 42వ సారి | Mumbai win Ranji Trophy for Record-extending 42nd time | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌గా ముంబై.. 42వ సారి

Published Thu, Mar 14 2024 1:51 PM | Last Updated on Thu, Mar 14 2024 3:37 PM

Mumbai win Ranji Trophy for Record-extending 42nd time - Sakshi

రంజీ ట్రోఫీ 2023-24 విజేతగా ముంబై నిలిచింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు ముంబై చిత్తు చేసింది. తద్వారా 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై తమ ఖాతాలో వేసుకుంది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది.

విదర్భ బ్యాటర్లలో కెప్టెన్‌ ఆక్షయ్‌ వాద్‌కర్‌(102), కరుణ్‌ నాయర్‌(74) పరుగులతో పోరాడనప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ముంబై బౌలర్లలో తనీష్‌ కొటియన్‌ 4 వికెట్లతో చెలరేగగా.. తుషార్‌ దేశ్‌ పాండే,ముషీర్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

వీరితో పాటు ధావల్‌ కులకర్ణి, సామ్స్‌ ములానీ చెరో వికెట్‌ సాధించారు.  ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన ముషీర్‌ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. అదేవిధంగా సీజన్‌ అసాంతం బౌలింగ్‌ ప్రదర్శనతో అకట్టుకున్న తనీష్‌ కొటియన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం విధర్బ సైతం తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై బౌలర్ల దాటికి విదర్బ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది.

ముంబై బౌలర్లలో కులకర్ణి, ములానీ, కొటియన్‌ తలా మూడు వికెట్లతో విధర్బను దెబ్బతీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విధర్బ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక విధర్బ చతికిలపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement