Ranji Trophy champions
-
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌గా ముంబై.. 42వ సారి
రంజీ ట్రోఫీ 2023-24 విజేతగా ముంబై నిలిచింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు ముంబై చిత్తు చేసింది. తద్వారా 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను ముంబై తమ ఖాతాలో వేసుకుంది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బ్యాటర్లలో కెప్టెన్ ఆక్షయ్ వాద్కర్(102), కరుణ్ నాయర్(74) పరుగులతో పోరాడనప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ముంబై బౌలర్లలో తనీష్ కొటియన్ 4 వికెట్లతో చెలరేగగా.. తుషార్ దేశ్ పాండే,ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ధావల్ కులకర్ణి, సామ్స్ ములానీ చెరో వికెట్ సాధించారు. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో పాటు బౌలింగ్‌లో అదరగొట్టిన ముషీర్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అదేవిధంగా సీజన్ అసాంతం బౌలింగ్ ప్రదర్శనతో అకట్టుకున్న తనీష్ కొటియన్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం విధర్బ సైతం తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై బౌలర్ల దాటికి విదర్బ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కులకర్ణి, ములానీ, కొటియన్ తలా మూడు వికెట్లతో విధర్బను దెబ్బతీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విధర్బ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక విధర్బ చతికిలపడింది. -
పటిష్టస్థితిలో గుజరాత్
ముంబై: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌లో రంజీ చాంపియన్ గుజరాత్ పటిష్టస్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ (73; 9 ఫోర్లు), చిరాగ్ గాంధీ ( 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. రెస్ట్ బౌలర్లలో స్పిన్నర్ నదీమ్ (4/53), హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్ (2/39) రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని (132) కలుపుకొని ప్రస్తుతం గుజరాత్ 359 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 206/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. -
గుజరాత్ గుబాళింపు
తొలిసారి రంజీ ట్రోఫీ సొంతం ఫైనల్లో ముంబైపై విజయం ఇండోర్: కెప్టెన్ పార్థివ్ పటేల్ (143; 24 ఫోర్లు) వీరోచిత సెంచరీ సాధించి గుజరాత్ క్రికెట్ జట్టు కల నెరవేర్చాడు. ముంబై జట్టుతో జరిగిన ఫైనల్లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది. ముంబై నిర్దేశించిన 312 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ 89.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. 89 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన గుజరాత్‌ను పార్థివ్ పటేల్, మన్‌ప్రీత్ జునేజా (54; 8 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. జునేజా అవుటయ్యాక రుజుల్ భట్ (27 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి పార్థివ్ ఐదో వికెట్‌కు 94 పరుగులు జతచేశాడు. విజయానికి 13 పరుగుల దూరంలో ఉన్నపుడు పార్థివ్ అవుటైనా రుజుల్, చిరాగ్ గాంధీ (11 నాటౌట్) మరో వికెట్ పడకుండా గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో గుజరాత్ జట్టు భారత దేశవాళీలో జరిగే మూడు ఫార్మాట్ల టోర్నీలు (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే, సయ్యద్ ముస్తాక్ అలీ టి20) నెగ్గిన నాలుగో జట్టుగా గుర్తింపు పొందింది. గతంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. తొలిసారి రంజీ ట్రోఫీ నెగ్గిన తమ జట్టుకు గుజరాత్ క్రికెట్ సంఘం రూ. 3 కోట్లు నజరానాగా ప్రకటించింది.