ఇరానీ కప్-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20ల్లో స్టైల్లో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న 76 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పృథ్వీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ముంబై 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ముంబై ప్రస్తుతం 274 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(9), తనీష్ కొటియన్(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్(191) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అదే విధంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది.. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అయితే ఇంకా కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం కన్పిస్తోంది.
చదవండి: ధోని కోసమే ఆ రూల్స్‌ను మార్చారు: మహ్మద్ కైఫ్
Comments
Please login to add a commentAdd a comment